: గాయకుడు అంకిత్ తివారీకి జ్యూడీషియల్ కస్టడీ


బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీకి ముంబయిలోని స్థానిక కోర్టు ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అత్యాచార ఆరోపణలతో మూడు రోజుల కిందట అరెస్టయిన తివారీపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 493 (వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేయటం), 506(2) (నేరపరమైన బెదిరింపులు) కింద వెర్సోవా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో అతని అన్న అంకుర్ తివారీని కూడా అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News