: సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఘోరపరాభవం
సీమాంధ్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాభవాన్ని చవిచూసింది. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పుట్టిముంచింది. సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కోలుకోలేని దుస్థితికి దిగజారిపోయింది. 1446 వార్డుల్లో టీడీపీ విజయం సాధించగా, 856 వార్డుల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ 55 వార్డులను గెలుచుకుని మూడో స్థానానికి దిగజారిపోయింది. వామపక్షాలు 17 వార్డులు గెలుచుకుని తమ ఉనికిని చాటుకున్నాయి. ఇతరులు 120 వార్డులు గెలుచుకుని సీమాంధ్రలో కాంగ్రెస్ కంటే తమకే ఆదరణ ఉందని చాటారు.