: కాంగ్రెస్ పై అపవాదులు వేశారు: పొన్నాల


కాంగ్రెస్ పార్టీపై ఎన్నో అపవాదులు వేశారని, వాటి సత్తా ఏ పాటిదో మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ, తమకు స్టార్ క్యాంపెయినర్ లేడని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు సరిగ్గా ప్రచారం చేయలేదని చాలా మంది ఆరోపణలు చేశారని అన్నారు.

ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూస్తే తాము ప్రచారం చేశామో లేదో తెలుస్తుందని ఆయన తెలిపారు. తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు సాధారణ కార్యకర్తలేనని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తలే తమకు పట్టంకడుతున్నారని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని పొన్నాల స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News