: మోడీ కోసం వారణాసి విడిచిపెట్టడంపై అసంతృప్తి లేదు: జోషి
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కోసం వారణాసి లోక్ సభ స్థానాన్ని విడిచిపెట్టడంపై తనకెలాంటి అసంతృప్తి లేదని ఆ పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్పష్టం చేశారు. ప్రస్తుతం కాన్పూర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, పార్టీ ప్రధాని అభ్యర్థి అధ్వర్యంలో దేశంలో అభివృద్ధి గాలి వీస్తోందని పేర్కొన్నారు. భారీ మెజారిటీతో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.