: జగన్ అవినీతికి ప్రజలు బుద్ధి చెప్పారు: సీఎం రమేష్


జగన్ అవినీతికి సీమాంధ్ర ప్రజలు బాగా బుద్ధి చెప్పారని టీడీపీ నేత సీఎం రమేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో విజ్ఞత ప్రదర్శించారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వెల్లడికానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. సీమాంధ్ర ప్రజలు అవినీతికి పట్టం కట్టరని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చి సీమాంధ్రను అబివృద్ధి పథాన నిలుపుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News