: వారణాసి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై కేసు నమోదు చేయండి: ఈసీ


ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్సభ స్థానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై కేసు నమోదు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారణాసిలో ఈ ఉదయం ఓటు వేసిన అనంతరం అజయ్ రాయ్ పోలింగ్ బూతు వద్ద కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంను ప్రదర్శించారు. దీనిపై జాతీయ ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన అజయ్ రాయ్పై తక్షణం కేసు నమోదు చేయాలని వారణాసి రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది.

  • Loading...

More Telugu News