: నగరం మళ్ళీ తడిసి ముద్దయింది!
వరుసగా రెండో రోజూ హైదరాబాద్ ను అకాల వర్షం పలకరించింది. ఈ సాయంత్రం నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పాతబస్తీతో పాటు దిల్ సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ళ వాన పడింది. ఇక శంషాబాద్ లో వర్షానికి ఈదురుగాలి తోడవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు జాతీయ రహదారిపై వర్ష బీభత్సానికి చెట్లు కూలిపోవడంతో ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయాయి.