: ఆగస్టు 31లోగా నివేదిక అందజేస్తాం: శివరామకృష్ణన్ కమిటీ


తమది కేవలం టెక్నికల్ కమిటీ మాత్రమే అని సీమాంధ్ర రాజధాని కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. రాజధాని నగరం కోసం సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలను, వనరులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పింది. ఆగస్టు 31లోగా అన్ని అంశాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపింది. రాజధానిపై తుది నిర్ణయాన్ని కేంద్రమే తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ రోజు విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ విషయాలను వెల్లడించింది.

  • Loading...

More Telugu News