: శ్వాస ఉన్నంత వరకు అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి: జస్టిస్ చంద్రకుమార్
విసుగు, విరామం లేకుండా... చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ పిలుపునిచ్చారు. ఈ రోజు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా రాసిన 'ఎథిక్స్' అనే పుస్తకాన్ని హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరూ విలువలకు కట్టుబడి ఉన్నప్పుడే సమాజం బాగు పడుతుందని అన్నారు. సమాజం మార్పుకు ఎథిక్స్ పుస్తకం ఉపయోగపడుతుందని చెప్పారు.