: క్వీన్ ఎలిజబెత్ పంట పండింది


ఎంత సంపన్నులైనా వ్యక్తిగతంగా సంవత్సరానికి మహా అయితే ఎంత ఖర్చు పెడుతారు..  ఓ పది లక్షలు, ఓ ఇరవై లక్షలు.. కాదుకూడదనుకుంటే ఓ యాభై లక్షలనుకుందాం. కానీ, బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కుఈ ఏడాది అధికారిక కార్యక్రమాల నిర్వహణ, ఖర్చుల నిమిత్తం ఎంత నగదు ఇవ్వనున్నారో తెలిస్తే.. వామ్మో అనడం ఖాయం. ఆ మహారాణి గారి వైభోగానికి దాదాపు రూ. 300 కోట్లు కేటాయించారు.

గతేడాది కంటే ఇది ఐదు శాతం ఎక్కువట. 81 ఏళ్ళ ఈ ముసలి రాణికి కిందటేడాది రూ. 255 కోట్లు చెల్లించుకున్నారట. రాజరికపు ఆస్తులను పరిరక్షించే క్రౌన్ ఎస్టేట్ ఈ రాణిగారి ఆర్ధిక వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కాగా, బ్రిటన్ వ్యాప్తంగా రాజ కుటుంబానికి సుమారు రూ. 6 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిపై వచ్చే ఆదాయాలను వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. 

  • Loading...

More Telugu News