: మధ్యాహ్నం 12.30కు కౌంటింగ్ ముగిసే అవకాశం: రమాకాంత్ రెడ్డి
రేపు (మే 12) ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరిగినందున... మధ్యాహ్నం 12.30 గంటలకు కౌంటింగ్ ముగిసే అవకాశముందని చెప్పారు. 8 వేల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారని వెల్లడించారు. 65 ప్రాంతాల్లోని 155 సెంటర్లలో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. మార్చి 30న 10 నగరపాలక సంస్థలు, 146 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాలలో రేపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు.