: రాజధాని కమిటీని నమ్మొద్దు: ఉత్తరాంధ్ర జేఏసీ


రాజధాని ఎంపిక కోసం సీమాంధ్రలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీని నమ్మకూడదని ఉత్తరాంధ్ర జేఏసీ తెలిపింది. కమిటీ పర్యటనను వ్యతిరేకిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యుడు రామారావు మాట్లాడుతూ, కమిటీ వచ్చింది రాజధాని కోసం కాదని... విహారయాత్ర కోసమని మండిపడ్డారు. ఈ కమిటీకి చిత్తశుద్ధి లేదని... వీరు జిల్లాల మధ్య చిచ్చు పెడతారని... కమిటీ సభ్యులు ప్రలోభాలకు కూడా లోనయ్యే అవకాశం ఉందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News