: మాతృ దినోత్సవం సందర్భంగా నటీ, నటుల అమ్మ ప్రేమ


యావత్ ప్రపంచం అమ్మను స్మరించుకునే రోజు నేడు. ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు అమ్మ ప్రేమను ట్విట్టర్లో ఇలా వ్యక్తం చేశారు. నీవల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. సంతోషంతో, సానుకూలతలతో ప్రతి రోజూ జీవిస్తున్నాను. ధన్యవాదాలు అమ్మా... అంటూ అర్జున్ రాంపాల్ పేర్కొన్నారు. హ్యాపీ మదర్స్ డే అమ్మా, కృతజ్ఞతలు అంటూ కరణ్ జోహార్ పోస్ట్ చేశారు. ఓ చిన్న వీడియోను కూడా బహుమతిగా పోస్ట్ చేశారు. నువ్వు నా బలం, విరామం ఎరుగకుండా నా పనులన్నీ చూస్తున్నందుకు థాంక్యూ అంటూ ప్రియంకాచోప్రా అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. ఇంకా అనుపమ్ ఖేర్, ఫరాఖాన్ తదతరులు కూడా పోస్ట్ లు చేశారు.

  • Loading...

More Telugu News