: టీఆర్ఎస్ ని చీల్చడం పెద్ద పనా... అందుకే కేసీఆర్ భయపడుతున్నాడు: అనిల్
టీఆర్‌ఎస్ పార్టీని చీల్చడం పెద్ద పని కాదని ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌లో 55 మంది తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఇచ్చారని, వారిలో ఎవరు గెలిచినా పార్టీని వీడే ప్రమాదముందని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. గతంలోనూ ఆ పార్టీలో అదే జరిగిందని ఆయన గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌కు 45 సీట్లు వచ్చే అవకాశముందన్న ఆయన, ఈ వాస్తవాన్ని గ్రహించిన కేసీఆర్ రాహుల్‌కు మద్దతిస్తానని చెబుతున్నారని తెలిపారు.