: చైన్ స్నాచర్ కు కూల్ డ్రింక్ సీసాతో బుద్ధి చెప్పిన మహిళ


ఓ చైన్ స్నాచర్ కు ఓ మహిళ కూల్ డ్రింక్ సీసాతో బుద్ధి చెప్పింది. అరాచకాల ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ మహిళ స్థానిక మార్కెట్ నుంచి సరుకులు కొని తీసుకువెళ్తోంది. ఇంతలో మోటారు సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమె పక్కనే ఆగారు. ముందున్న వ్యక్తి అడ్రస్ అడుగుతుండగా, వెనుకున్న వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె కేకలు వేస్తూ తన చేతిసంచిలోని కూల్ డ్రింక్ సీసాతో చావబాదింది. చుట్టు పక్కలవాళ్లంతా వచ్చేలోపు బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించారు దొంగలు.

  • Loading...

More Telugu News