: నేడూ అక్కడక్కడా వర్షాలు
ఉత్తరకోస్తాలో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి, విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కదులుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. మరోవైపు రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం పూర్తిగా బలహీనపడినట్లు వెల్లడించింది.