: క్లైమాక్స్ కు చేరుకున్న సార్వత్రిక ఎన్నికలు... ప్రచారం పరిసమాప్తం
దేశవ్యాప్తంగా జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దాదాపుగా రెండు నెలలుగా హోరెత్తిన ప్రచారం ముగిసింది. ఇవాళ సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం పరిసమాప్తి అయింది. సోమవారం నాడు చివరి విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. 41 నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో ఎనిమిది విడతలుగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 502 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక, మరో విడత మాత్రమే పోలింగ్ మిగిలి ఉంది. ఈ నెల 16వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు.