: తెలంగాణలో 50 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుంది: డీకే అరుణ
తెలంగాణలో 50 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలతో పాటు, సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే విజయమని అన్నారు. కాగా మరో 10-15 స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని ఆమె తెలిపారు. సీఎం అభ్యర్థి విషయంలో అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని అన్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.