: మాజీ మంత్రి గంటాను కలసిన లగడపాటి


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. విశాఖలోని గంటా నివాసంలో వీరి సమావేశం జరిగింది. అనంతరం లగడపాటి మాట్లాడుతూ, ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని... గంటా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతోనే ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తాను రాజకీయాలకు దూరంగానే ఉన్నానని తెలిపారు. జిల్లాలోని నర్సీపట్నంలో ఓ పెళ్లికి వెళ్తూ గంటా ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చానని చెప్పారు.

  • Loading...

More Telugu News