: బీజేపీలో చేరిక వార్తలను ఖండించిన ప్రఫుల్ పటేల్


భారతీయ జనతా పార్టీలోకి తాను చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఖండించారు. ఈ మేరకు ఢిల్లీలో మాట్లాడిన ఆయన, అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. గుజరాత్ 'స్నూప్ గేట్' కేసులో ప్రత్యేక జడ్జితో దర్యాప్తు చేయించాలని కొన్ని రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రఫుల్, మరో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలను ముందు పెట్టుకుని దర్యాప్తు చేయిస్తాననడం సరికాదని కాంగ్రెస్ కు సూచించారు. ఈ క్రమంలో బీజేపీకి ఆయన మద్దతు పలుకుతున్నారని, త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరిగింది.

  • Loading...

More Telugu News