: గర్భవతులకు మత్తు మందిచ్చి ఆపరేషన్ చేయకుండా వదిలి వెళ్లారు!
వరంగల్ జిల్లా జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గర్భవతులు డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చారు. ఆపరేషన్ చేస్తామంటూ వారికి వైద్యులు మత్తు మందు కూడా ఇచ్చారు. ఆ వెంటనే తమ డ్యూటీ ముగిసిందంటూ ఆపరేషన్ చేయకుండానే వైద్యులు, సిబ్బంది వెళ్లిపోయారు. దాంతో, ఆసుపత్రి ఎదుట గర్భవతుల బంధువులు ఆందోళన చేపట్టారు.