: ఇప్పుడు రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలి!: మాజీ మంత్రి శంకరరావు
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు విద్యుత్ ఛార్జీల విషయంలో కేంద్రానికి వినూత్నంగా విన్నవించారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే, ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఆదుకున్నారని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. అందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం ఆదుకోవాలని ఆయన అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి అదనపు విద్యుత్తు, గ్యాస్ ఇవ్వాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కాగా, టీడీపీపై ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షనేతగా హ్యాట్రిక్ సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారనీ, తద్వారా కాంగ్రెస్ రాష్ట్రంలో మూడోమారు అధికారంలోకి రావడం ఖాయమనీ శంకరరావు అన్నారు.

- Loading...
More Telugu News
- Loading...