: ప్రియుడినంటూ ఐశ్వర్యరాయ్ పై శ్రీలంకన్ ఫిర్యాదు!


అందాలభామ ఐశ్వర్యరాయ్ మాజీ ప్రియుడినంటూ శ్రీలంకకు చెందిన నిరోషణ్ దేవప్రియ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఐష్ తో తనకు రొమాంటిక్ రిలేషన్ ఉందంటూ ఆరోపిస్తున్నాడు. అభిషేక్ బచ్చన్ ను ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని ఫిర్యాదులో తెలిపాడు. ఇందుకోసం సదరు వ్యక్తి తన తరపున వాదించేందుకు ఓ లాయర్ ను కూడా నియమించుకున్నాడట. ఐష్-అభీ పెళ్లయి, వారికి ఓ రెండేళ్ల పాప కలిగిన ఏడు సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి బయటికి రావడం గమనార్హం. మరి ఈ విషయం ఎంతవరకు నమ్మదగిందో!

  • Loading...

More Telugu News