: సాయిబాబా అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆందోళన
నిన్న ఢిల్లీలో అరెస్టయిన అమలాపురం వాసి నాగసాయిబాబాకు మద్దతుగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు ఢిల్లీలోని మహారాష్ట్ర భవన్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న సాయిబాబాను మావోయిస్టు అంతర్జాతీయ సమన్వయకర్త అంటూ మహారాష్ట్ర పోలీసులు నిన్న అరెస్టు చేశారు. వెంటనే అతనిని గడ్చిరోలి తరలించారు. దీనిపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రొఫెసర్ మంచివాడని, ఆయనకు అలాంటి సంబంధాలు లేవని నినదిస్తున్నారు.