: ఈ నెల 15న పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల


పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 15వ తేదీన విడుదల చేసేందుకు ఎస్ఎస్ సీ బోర్డు సిద్ధమవుతోంది. నాంపల్లిలోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో టెన్త్ ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బిల్లుల చెల్లింపునకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఫలితాలను ముందుగా విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వ విభాగాలన్నీ బిల్లులను ఈ నెల 15లోగా పే అండ్ అకౌంట్స్ ఆఫీసుకు పంపితేనే చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి అందుకు అనుగుణంగానే ఫలితాలను విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈసారి పదోతరగతి పరీక్షలకు 11 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన విషయం విదితమే.

  • Loading...

More Telugu News