: రాజమండ్రిలో భారీ వర్షం
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాజమండ్రిలో ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనావాసాల్లో మోకాళ్ల లోతు నీరు చేరిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఆర్యాపురం, తుమ్మవాలా తదితర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.