: వారణాసికి ప్రత్యేక పోల్ పరిశీలకుడు నియామకం


వారణాసి స్థానానికి ప్రత్యేక పోల్ పరిశీలకుడిగా తమిళనాడు కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఉమేష్ సిన్హా మాట్లాడుతూ, ఇప్పటికే ఆయన వారణాసి చేరుకున్నారని, పోలింగ్ ముగిసేంతవరకు అక్కడే ఉంటారని తెలిపారు. వారణాసి స్థానానికి ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది.

  • Loading...

More Telugu News