: టీవీ కళాకారులకు పెరుగుతోన్న మద్దతు
తెలుగు టీవీ ఛానళ్లలో డబ్బింగ్ సీరియల్స్ నిలిపివేయాలని కోరుతూ ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్షలు చేస్తోన్న బుల్లి తెర కళాకారులకు రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. మూడో రోజైన ఇవాళ సీపీఐ శాసనసభాపక్షనేత గుండా మల్లేష్, సీవోడబ్ల్యూ నేత సంధ్య, సినీ దర్శకుడు శంకర్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ డబ్బింగ్ సీరియల్స్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని వేలాదిమంది ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.