: స్యామీ కెప్టెన్సీపై వేటు!


డారెన్ స్యామీ కెప్టెన్సీపై విండీస్ క్రికెట్ బోర్డు వేటువేసేందుకు సిద్ధమైంది. ఉత్తమ ఆల్ రౌండర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన స్యామీ, 2010 నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2013లో వన్డే కెప్టెన్సీ నుంచి స్యామీని తప్పించిన విండీస్ బోర్డు డ్వేన్ బ్రావోకి ఆ బాధ్యతలు అప్పగించింది. తాజాగా స్యామీపై టెస్టు కెప్టెన్సీ నుంచి వేటు వేసేందుకు విండీస్ క్రికెట్ బోర్డు రంగం సిద్ధం చేసిందని ట్రినిడాడ్ గార్డియన్ పత్రిక వెల్లడించింది. స్యామీ నుంచి వికెట్ కీపర్ దినేష్ రామ్ దిన్ కు కెప్టెన్సీ బాధ్యలు అప్పగించనుంది. కెప్టెన్సీ చేపట్టేందుకు రామ్ దిన్ సిద్ధంగా ఉన్నట్టు బోర్డు ప్రకటించింది.

  • Loading...

More Telugu News