: తెలంగాణలో తారస్థాయికి చేరుతున్న మైండ్ గేమ్ రాజకీయం


తెలంగాణలో రాజకీయాలు తారస్థాయికి చేరుతున్నాయి. మైండ్ గేమ్ తో ప్రధాన పార్టీలు రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. తామే అధికార పీఠాన్ని అధిరోహిస్తామంటూ కేసీఆర్ చెబుతుంటే... కాదు కాదు, తెలంగాణలో అధికారం కాంగ్రెస్ హస్తగతమవుతుందని పొన్నాల అంటున్నారు. ఓటమి భయంతో కేసీఆర్ క్యాంపులు నిర్వహిస్తూ అభ్యర్థులు చేజారిపోకుండా చూసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతూ అభ్యర్థులను పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు.

దీనిని రెండు పార్టీల నేతలు ధృవీకరిస్తున్నారు. కాగా రెండు పార్టీల్లో మెజారిటీపై సందేహాలు నెలకొనడంతో, రెండు పార్టీలు తమ అభ్యర్థులను రక్షించుకుంటూనే, ప్రత్యర్థుల శిబిరాల్లోని ఆశావహులతో చర్చల్లో మునిగినట్టు ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. దీంతో ఫలితాల ప్రకటనకు ముందే తెలంగాణలో రాజకీయం రక్తికడుతోంది.

  • Loading...

More Telugu News