: చైనాలో వెయ్యి బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయ్!
ఉత్తర చైనాలో వెయ్యి పురాతన బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. 12 నుంచి 25 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ విగ్రహాలు షాంగ్జీ రాష్ట్రంలో బయటపడ్డాయని చైనా పురావస్తు శాఖాధికారులు తెలిపారు. ఈ బుద్ధ విగ్రహాలు క్రీ.శ. 1368 - 1644 మధ్య కాలానికి చెందినవిగా పురావస్తు శాఖ గుర్తించింది.