: 2జీ వ్యవహారంలో దాచడానికి ఏమీ లేదు: ప్రధానమంత్రి
బీజేపీ నేత యశ్వంత్ సిన్హా లేఖపై ఎట్టకేలకు ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పారు. 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో తాము దాచడానికి ఏమీ లేదన్నారు. ఈ కేసులో లోతుగా విచారణ చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అన్ని దస్త్రాలు సమర్పించినట్లు తన కార్యాలయం (ప్రధాని కార్యాలయం) చెప్పిందన్నారు. అయితే తనను జేపీసీ ఎదుట విచారణకు హాజరుకావాలని సమన్లు పంపాలా? లేదా? అనేది పూర్తిగా కమిటీయే నిర్ణయిస్తుం
2జీ స్పెక్ట్రమ్ కేసులో ప్రధానిని రక్షించేందుకు జేపీసీ ప్రయత్నిస్తోందంటూ తీవ్రంగా ఆరోపించిన యశ్వంత్ సిన్హా రెండురోజుల కిందట ప్రధాని మన్మోహన్ కు లేఖ రాశారు. ఇదిలావుంటే, న్యూఢిల్లీలోని ఓ ప్రయివేటు కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించటం అంత తేలికకాదని నిక్కచ్చిగా చెప్పారు.