: ఎగ్జిట్ పోల్స్ ప్రకటనకు క్లారిటీ ఇచ్చిన సీఈసీ
దేశంలో ఎగ్జిట్ పోల్స్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ స్పష్టత ఇచ్చింది. ఈ నెల 12న సాయంత్రం 6.30 తర్వాత ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. కాగా, ఇప్పటికే ఎనిమిది దశల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక 12వ తేదీన జరిగే ఎన్నికలతో పోలింగ్ మొత్తం ముగియనుంది.