: ఎన్డీయే 300 లోక్ సభ సీట్లు గెలుస్తుంది: అమిత్ షా
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రచార నిర్వాహకుడు, మోడీ సన్నిహితుడు అమిత్ షా ధీమాతో ఉన్నారు. ఎన్డీయే కూటమి మూడు వందల లోక్ సభ సీట్లు గెలుస్తుందని మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. దాంతో, తమ పార్టీ అభ్యర్థి నరేంద్రమోడీయే ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘంపై మండిపడ్డ షా, తమ బాధ్యతల అమలు నుంచి ఈసీ దూరంగా వెళుతోందని ఎద్దేవా చేశారు. మోడీ ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా రద్దు చేయించడంలో జిల్లా మేజిస్ట్రేట్ పాత్రపై దర్యాప్తు చేయిస్తామన్నారు. ఎన్నికలను స్వేచ్చగా, సజావుగా జరపాలని ఈసీ కోరుకుంటే వారణాసి నుంచి డీఎంను ట్రాన్స్ ఫర్ చేయాలని షా సూచించారు.