: రాహుల్ పై వ్యాఖ్యల కేసులో రాందేవ్ కు ఊరట
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు పిక్ నిక్, హనీమూన్ కోసం వెళుతున్నారంటూ యోగా గురువు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై కాంగ్రెస్ నేతలు కేసు వేయడంతో సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా హెచ్చరించింది. అలాగే, రాందేవ్ పై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే కూడా ఇచ్చింది. పది లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని కూడా ఆయనను కోర్టు ఆదేశించింది.