: సహకార బ్యాంకుల విభజనపై గవర్నర్ సమీక్ష
రాష్ట్ర విభజన నేపథ్యంలో సహకార బ్యాంకుల విభజనపై గవర్నర్ నరసింహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సహకార బ్యాంకులు, సొసైటీల విభజన... అప్పులు, వసూళ్లకు సంబంధించిన విషయాలపై గవర్నర్ సమీక్షించారు. విభజనకు సంబంధించిన అన్ని అంశాలను 25వ తేదీలోగా ముగించాలనుకుంటున్న గవర్నర్, ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు.