: మోడీకి ఓటమి తప్పదు: కేజ్రీవాల్
వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటమి తప్పదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. వారణాసిలో ఆయన మాట్లాడుతూ, భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. వారణాసిలో కేజ్రీవాల్ ఈ ఉదయం రోడ్ షో నిర్వహించారు. కేజ్రీవాల్ మద్దతు దారులు తెల్లటోపీలు, చేతుల్లో చీపుర్లతో రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీ భారీ ర్యాలీ నిర్వహించిన మరుసటి రోజే కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించడం విశేషం.