: చెరుకు తోటలో ప్రియుడితో భర్తపై భార్య దాడి


విలువలు మంటగలిసిపోతున్నాయి. బంధాల కంటే తాత్కాలిక సుఖాలే ముఖ్యమైపోతున్నాయి. క్షణికావేశంలో దారుణమైన తప్పిదాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో కట్టుకున్న భార్య ప్రియుడితో కలసి భర్తపై దాడికి పాల్పడింది. దీంతో భర్త గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. తోట్లవల్లూరు మండలంలోని కుమ్మమూరుకు చెందిన మత్తే శోభనాద్రి ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు చల్లపల్లి వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య సలోమి ఇంట్లో కనిపించకపోవటంతో చుట్టుపక్కల వెదికాడు. అక్కడ కూడా కనిపించకోపోవడంతో సమీపంలోని పొలాల్లో వెతికాడు.

చెరకుతోటలో నుంచి సలోమితో పాటు ఆమె ప్రియుడు శంకర్ బయటకు వచ్చారు. దీంతో శోభనాద్రి ఇదేమిపని? అంటూ వారిని నిలదీసేసరికి, వారిద్దరూ కలసి శోభనాద్రిపై దాడిచేశారు. గాయపడిన అతన్ని స్థానికులు ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News