: నేదురుమల్లి కుటుంబానికి ఫోన్ లో సోనియా పరామర్శ


మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ సంతాపం తెలిపారు. ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా, నేదురుమల్లి అంత్యక్రియలు నెల్లూరు జిల్లాలోని వాకాడులో రేపు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News