: షారుక్, అజయ్ దేవగణ్, సునీల్ శెట్టిలకు ఎంపీ కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, సునీల్ శెట్టి, మనోజ్ బాజ్ పాయ్ సహా మరో ఏడుగురికి మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ లిక్కర్ బ్రాండ్లకు ప్రచారం చేసినందుకు ఈ నోటీసులు ఇచ్చింది. దానికి వివరణ ఇస్తూ ఆరు వారాల్లోగా వారందరూ తమ సమాధానాన్ని ఫైల్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయవాది అవ్ధేష్ భదోరియా దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు పైవిధంగా స్పందించింది.