: నేడు టీఆర్ఎస్ కార్యవర్గం కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జరగనుంది. పార్టీ అధినేత అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలతో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు సమాచారం. ఈ నెల 12, 13 తేదీల్లో మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ లకు జరిగిన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.