: అత్యవసరంగా ల్యాండ్ అయిన సోనియా ప్రయాణిస్తున్న విమానం


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం అత్యవసరంగా ఆగ్రాలో ల్యాండ్ అయింది. న్యూఢిల్లీలో భారీ ఈదురు గాలులు, వాతావరణం సరిగా లేకపోవడంతో ఆగ్రాలోని ఖెరియా విమానాశ్రయంలో దింపాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. ఓ గంట తర్వాత తిరిగి సోనియా అదే విమానంలో వెళ్లిపోయినట్లు అధికారి వివరించారు.

  • Loading...

More Telugu News