: వారణాసిలోని చేనేత పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి పొందేలా కృషి చేస్తా: మోడీ


వారణాసిలో చేనేత పనిచేసే ఎందరో ముస్లింలు ఉన్నారని, వారి అభివృద్ధికి, చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. వారణాసిలోని చేనేత పరిశ్రమను ప్రపంచ ప్రసిద్ధి పొందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమ వారణాసికి పూర్వవైభవం తీసుకువస్తుందని ఆయన అన్నారు. ఇవాళ వారణాసి శివారులోని రోహానియా ప్రాంతంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోడీ సభకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తను ఎన్నికైన తర్వాత వారణాసిని పర్యాటక రంగంలో నెంబర్ వన్ పట్టణంగా మారుస్తానని హామీ ఇచ్చారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ పతంగులు తయారుచేసే ముస్లిం వర్గానికి ఎంతో సహాయం చేశానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News