: హైదరాబాదులో వర్షం
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో ఎండ వేడి నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే వాతావరణం చల్లబడింది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, దాంతో పాటు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలోనే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.