: ఏపీ సీఎం కోసం సచివాలయంలో సౌత్ బ్లాక్ రెడీ
అపాయింటెడ్ డే దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం హైదరాబాదు సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాక్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ, ఐటీ అధికారులు ఇవాళ బ్లాక్ ను పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండే బ్లాక్ కావడంతో భద్రతాపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే ఈ బ్లాక్ లో ఉన్న కార్యాలయాలను తరలించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు.