: ఆ ముగ్గురూ తిమింగలాన్ని పట్టేశారు


విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామ మత్స్యకారులు ఓ భారీ తిమింగలాన్ని పట్టేశారు. రోజూలానే చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గ్రామస్థుల టేకుల వలలో రెండు టన్నుల బరువు గల తిమింగలం చిక్కింది. వారు ముగ్గురూ దీనిని అతి కష్టమ్మీద ఒడ్డుకు చేర్చారు. తిమింగలాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో సముద్రతీరానికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News