: అతని నుంచి విడిపోవడమే అత్యంత విషాదకరమైన ఘటన: లోపెజ్
మార్క్ ఆంథోనీ నుంచి విడాకులు తీసుకోవడమే తన జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన అని సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ తెలిపారు. లాస్ ఏంజెలెస్ లో ఆమె మాట్లాడుతూ, మార్క్ తో విడిపోయాక జీవితం దుర్భరంగా మారిందని అన్నారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తరువాత 2012 లో మార్క్ ఆంథోని, లోపెజ్ లు విడిపోయారు. విడాకుల తరువాత తనను ఒక్కసారిగా శూన్యం ఆవరించిందని, ఎన్నడూ లేనంత విషాదం తన జీవితాన్ని చుట్టుముట్టిందని ఆమె వెల్లడించారు.
ఆ ఘటన నుంచి తాను బయటపడలేకపోయేదాన్నని, చాలా బాధపడ్డానని లోపెజ్ తెలిపింది. ఇప్పుడిప్పుడే తాను వాస్తవాన్ని గ్రహిస్తున్నానని, ఇక ఒంటరిగా ఉండడం వల్ల ఉపయోగం లేదని నిర్ధారించుకుని, ఎవరో ఒకరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నానని ఆమె తెలిపింది. మార్క్ తో విడాకుల తరువాత డాన్సర్ కాస్పర్ స్మార్ట్ తో లోపెజ్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.