: అతని ఆటతీరుకు దిగ్గజ క్రికెటర్లు దాసోహం... సెహ్వాగ్ కూడా అభిమానే
ఆస్ట్రేలియన్ ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ అభిమానుల జాబితాలో సెహ్వాగ్ కూడా చేరిపోయాడు. అతని ఆటతీరుకు దిగ్గజ క్రికెటర్లంతా దాసోహమవుతున్నారు. వారు, వీరు అని తేడా లేకుండా అందర్నీ గ్లెన్ మాక్స్ వెల్ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ కూడా అతని ప్రదర్శనకు ముగ్ధుడయ్యాడు. తన కంటే, క్రిస్ గేల్ కంటే కూడా గ్లెన్ మాక్స్ వెల్ ప్రమాదకరమైన ఆటగాడని వీరూ తెలిపాడు. పంజాబ్ జట్టులో భాగమైన సెహ్వాగ్, మాక్స్ వెల్ ఆటతీరును దగ్గర్నుంచి పరిశీలిస్తున్నాడు.
మాక్స్ వెల్ గోల్ఫ్ తోనే ఎక్కువ గడుపుతున్నాడని, అందుకే భారీషాట్లను అలవోకగా ఆడేస్తున్నాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. మిల్లర్ కూడా విధ్వంసకర ఆటగాడేనంటూ మరో సహచరుడ్ని కూడా వీరూ ఆకాశానికెత్తేశాడు. వీరిద్దరూ క్రీజులో కుదురుకున్న రోజున బౌలర్లకు చుక్కలు కనపడాల్సిందేనని వీరూ తెలిపాడు.