: ఈ నెల 10వ తేదీన ఈసెట్ ప్రవేశ పరీక్ష
ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఈసెట్ ప్రవేశ పరీక్ష జరుగుతుందని ఈసెట్ ఛైర్మన్, జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ తులసీరామ్ దాస్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్, డీ-ఫార్మసీ చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్ లో ప్రవేశానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 91 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 19న ఫలితాలను విడుదల చేస్తామని ఈసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు.