: విద్యుదాఘాతంతో వర్మి కంపోస్ట్ యార్డు అగ్నికి ఆహుతి


పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని చక్రదేవరపల్లి గ్రామ సమీపంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న వర్మి కంపోస్ట్ యార్డు ఇవాళ విద్యుదాఘాతంతో పూర్తిగా తగులబడింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 40 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు జంగారెడ్డిగూడెం అగ్నిమాపక కేంద్రం అధికారి ఆనందరావు తెలిపారు. కంపోస్ట్ యూనిట్ తో పాటు 20 ఎకరాల్లోని గడ్డివాములు, 40 కొబ్బరిచెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. బాధిత రైతు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... వర్మి కంపోస్ట్ యూనిట్ పై నుంచి వెళ్లిన కరెంటు తీగల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News